నా పేరు వాడొద్దు... కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్
- పోక్సో కేసులో తన పేరును ఉపయోగించకుండా చూడాలని పిటిషన్
- ఇప్పటి వరకు వాడిన వీడియోలు తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి
- తన కుమారుడి వివాదంలో తన పేరు ఉపయోగించకుండా ఉత్తర్వులివ్వాలన్న బండి సంజయ్
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పోక్సో కేసులో భవిష్యత్తులో తన పేరును వాడకుండా చూడాలని పిటిషన్ వేశారు. అలాగే తన పేరుతో ఇప్పటి వరకు వాడిన వీడియోలను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. తన కుమారుడిపై నమోదైన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కాబట్టి ఈ వివాదంలో తన పేరును ఎక్కడా ఉపయోగించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఇదిలా ఉండగా, బండి భగీరథ్ కేసులో బాలిక వివరాలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం కావడంపై కేసు నమోదైంది. బాలిక ఫొటోలు, వీడియోలు, తల్లిదండ్రుల వివరాల ప్రసారంపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఛైర్పర్సన్ ఫిర్యాదు మేరకు సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు.